DEO Siddipet

1 / 15
Integrated District Offices Complex-Siddipet
2 / 15
Sri Ranganayaka Sagar-Chinnakodur
3 / 15
komati Cheruvu - Siddipet
5 / 15
Mission Bhagiratha-Siddipet
6 / 15
Government General Hospital-Siddipet
7 / 15
Kendriya vidyalaya-Siddipet
8 / 15
Vipanchi Kalanilayam
9 / 15
Mahathi Auditorium - Gajwel
10 / 15
Mission Bhagiratha Pylon -Siddipet
11 / 15
Shanigaram Reservoir
12 / 15
Integrated District Offices Complex-Siddipet

Flash News....* If any corrections... please contact Y Narsimlu ASO O/0 DEO Siddipet 9177148591. DEO SIDDIPET.

ప్రీ ప్రైమరీ సెక్షన్ ఏర్పాటు కొరకు instructors మరియు ఆయాలను నియమించటం కొరకై ప్రకటన Notification for Engagement of Pre Primary Instructors in Siddipet Dist

పత్రికా ప్రకటన

Dt:06.06.2026

సిద్దిపేట,

సిద్ధిపేట జిల్లాలో నూతనంగా మంజూరైన (86) పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుండి స్థానిక ప్రాథమిక పాఠశాల మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లోని విద్యార్ధులకు బోధించడానికి మహిళా బోధకులు మరియు మహిళా ఆయాలను నియమించుటకు గౌరవ జిల్లా కలెక్టర్, సిద్ధిపేట గారు అనుమతించారు. అందుకుగాను స్థానిక మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి.

1. బోధకులుగా పనిచేయుటకు అర్హతలు:

ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత.
పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక విద్య కోర్సు చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. 
గౌరవ వేతనం: రూ.8,000/- నెలకు

2. ఆయాగా పనిచేయుటకు అర్హతలు:

7వ తరగతి ఉత్తీర్ణత.
గౌరవ వేతనం: రూ. 6,000/- నెలకు.

3. వయస్సు:

నోటిఫికేషన్ నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వరకు.

4. వయో సడలింపు:

SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
మాజీ సైనిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు.
దివ్యాంగులకు 10 సంవత్సరాలు.

5. స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును.

దరఖాస్తులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తేదీ 08.06.2026 నుండి 12-06-2026 వరకు సాయంత్రం 5:00 గంటలలోపు స్వీకరించబడును.

దరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాలు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో లేదా www.deosiddipet.in వెబ్సైట్లో పొందగలరు.

వి.శాస్త్రి

జిల్లా విద్యాధికారి & పదవిరీత్యా, డిపిఓ, ఎస్ఎస్, సిద్దిపేట.

Category

Post a Comment

0 Comments

Ads Area